మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:05 AM
మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నేటి నుంచి 19 వరకు బుగ్గ రామేశ్వరుని ఉత్సవాలు
ఓర్వకల్లు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అన్ని ఏర్పా ట్లు చేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యు డు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, ఈవో మద్దిలేటి కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు కోనేర్లను శుభ్రపరిచి బోరు నీటితో నింపారు. అలాగే భక్తులకు తాగునీరు, వసతి, మరుగు దొడ్లు, వాహనాల పార్కింగ్, పోలీస్ ఔట్‌పోస్టు, షామియానాలు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద క్యూలైన్లు, ఎండలో దృష్టిలో ఉంచు కుని గుడారాలు, ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. విద్యుత ఏఈ సునీల్ బాబు ఆధ్వర్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. సినీ సంగీత విభావరి ప్రదేశాన్ని చదును చేసి పారిశుధ్య పనులు చేయించారు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: ఆర్డీవో
కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మో త్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్ అన్నారు. శుక్రవారం కాల్వబుగ్గలో మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న పను లను ఆయన పరిశీలించారు. చిన్న కోనేరు, పెద్ద కోనేరు, ఆలయం క్యూలైన్లు, తదితర మౌలిక వసతులను పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు ఆలయ సిబ్బంది, కమిటి సభ్యులు సమష్టిగా పని చేసి విజయవంతం చేయాలని కోరారు. ఎండలు అధికంగా ఉండటంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా షామియానాలు ఏర్పాటు చేసుకో వాలని, తాగునీటి సమస్య లేకుండా అన్ని ఏర్పాటు చూసుకోవాల్సిన బాద్యత అధికారులపై ఉందన్నారు. అనంతరం శివునికి అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మద్దిలేటి, తహసీల్దార్ విద్యాసాగర్, ఆలయ చైర్మన కాటినేని నారాయణ, ధర్మకర్త కాకి దేవేంద్ర, సర్వేయర్ శంకర్ మాణిక్యం, ఆలయ అర్చకులు కల్లె లక్ష్మీనా రాయణ శర్మ, కల్లె లక్ష్మీనరసింహ శర్మ పాల్గొన్నారు.