సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:47 PM
మంత్రాలయం మండలంలోని మాధవరం గ్రామానికి ఈనెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తుండడంతో జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేపడుతున్నారు.
మాధవరం గ్రామ సమీపంలో పరిశీలించిన అధికారులు
మంత్రాలయం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం మండలంలోని మాధవరం గ్రామానికి ఈనెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తుండడంతో జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేపడుతున్నారు. మంగళవారం కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసెకృష్ణమ్మ ఏర్పాట్లను పరిశీలించారు. మాధవరం గ్రామ సమీపంలో తుంగభద్ర రోడ్డు అదానీ విల్‌మార్ గెస్ట్‌హౌ్‌సలో హెలిప్యాడ్, టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశం స్థల పరిశీలన చేశారు. రోడ్లు, హెలిప్యాడ్, సభా ప్రాంగణం, తాగునీరు, పార్కింగ్ వంటి స్థల పరిశీలన పూర్తి చేశారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి, మంచాల సింగిల్ విండో అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచు రఘునాథరెడ్డి, తహసీల్దారు రమాదేవి ఆధ్వర్యంలో ముమ్మరంగా పనులు చేపట్టారు. అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ అధికారులు, నేషనల్ సెక్యూరిటీ, స్టేట్ సెక్యూరిటీ అధికారులతో పాటు, పోలీస్ సిబ్బంది భద్రత ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఈ ఏర్పాట్లలో ఆదోని సబ్ కలెక్టర్ మధుసూదన్ రెడ్డి, ఏఎస్పీ హుస్సేన్ పీరా, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహే్‌షరెడ్డి, ఈఈ పద్మనాభరెడ్డి, డీఈ నాగరాజు, ట్రాన్స్‌కో ఏడీలు శాంతి స్వరూప్, ఫరూక్, జాన్సన్, నాగేంద్రప్రసాద్, డీఈ రవిచంద్ర, ఏఈ గోవిందు, డీఎస్పీ ఉపేంద్రబాబు, మంత్రాలయం సీఐ దస్తగిరిబాబు టీడీపీ నాయకులు రాకే్‌షరెడ్డి, రాజారెడ్డి, మాజీ జడ్పీటీసీలు లక్ష్మయ్య, రామకృష్ణ, ఎస్‌ఎం గోపాల్‌రెడ్డి, రామిరెడ్డి, ముత్తురెడ్డి, అయ్యన్న, వరదరాజు, సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
1,200 మందితో పటిష్ట భద్రత
సీఎం పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి
ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్
పత్తికొండ/తుగ్గలి, జూన్ 23, (ఆంధ్రజ్యోతి): జొన్నగిరి గోల్డ్ మైన్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను మంగళవారం వారు తనిఖీ చేశారు. సీఎం పర్యటన కోసం ముగ్గురు ఏఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 76 మంది ఎస్‌ఐలు, 300 ఏఆర్, ఏపీఎస్పీ, స్పెషల్‌పార్టీ పోలీసు సిబ్బందితో మొత్తం 1,200 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, కడప, నంద్యాల ఏఎస్పీలు హుసేన్‌పీరా, ప్రకా్‌షబాబు, చిన్నికృష్ణ సిబ్బంది ఉన్నారు.