Share News

ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:25 AM

జిల్లాకు వచ్చే పర్యా టకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో అటవీ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ పక్కన ఎస్పీ తదితరులు

నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు వచ్చే పర్యా టకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో అటవీ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడు తూ జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులను వినియోగించుకోవాలన్నారు. ఈ దిశగా తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బనగానపల్లి మండలం గులాం అలీబాద్‌లో ఫారెస్ట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 16 కింద డీకేటీ, ఆక్రమణలపై నివేదిక సమర్పిం చాలన్నారు. సర్వనరసింహస్వామి ఆలయాభివృద్ధికి అవసరమైన పాత గెజిట్‌ ప్రతులను సమర్పించాలన్నారు. ఆత్మకూరు పరిధిలో రిజర్వ్‌ ఫారెస్ట్‌గా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని, శ్రీశైలం దేవస్థానం నుంచి రావాల్సిన నిధులను త్వరగా మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ సునీల్‌ షెరాన్‌ మాట్లాడుతూ శ్రీశైలం ముఖద్వారం నుంచి సాక్షి గణపతి ఆలయం వరకు రహదారి వెడ ల్పు చేయడం, సాక్షి గణపతి ఆలయం వద్ద పార్కింగ్‌ సౌకర్యాలను విస్తరించడంపై చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ కార్తీక్‌, ప్రాజెక్ట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అనురాగ్‌మీనా, ఆత్మ కూరు డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ అపావు, డీఎఫ్‌వో నాగమునీశ్వరి, డీఆర్వో రామునాయక్‌, సర్వే ఏడీ శ్రీరామ్‌మోహన్‌, డీఎంజీవో వేణుగోపాల్‌, దేవాదాయ శాఖ అధికారి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:25 AM