పంచమఠాల్లో ఆర్జిత అభిషేకాలు
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:12 PM
కార్తీక మాసంలో శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు పంచమఠాలలో స్వయంగా శివలింగానికి అభిషేకం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేశ్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
కార్తీక మాసంలో గర్భాలయ అభిషేకాలు నిలుపుదల
శ్రీశైలం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసంలో శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు పంచమఠాలలో స్వయంగా శివలింగానికి అభిషేకం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేశ్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానాలయానికి ఉపాలయాలుగా ప్రసిద్ధిగాంచిన ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగఽధర మఠాల్లోని మూలవిరాట్టు శివలింగాలకు సామాన్య భక్తులు కూడా ఆర్జిత అభిషేకాలు చేసుకునేందుకు వీలుగా కేవలం రూ.216 రుసుముతో అధికారిక ఆన్లైన్ వెబ్సైట్లు మనమిత్ర వాట్సా్‌పలో టిక్కెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. అదే విధంగా నవంబరు 10వతేది నుంచి డిసెంబరు 9వతేది వరకు జరిగే కార్తీక మాసోత్సవాల్లో ప్రధానాలయంలో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేయనున్నట్లు తెలిపారు.