డీఎస్సీపై చర్చకు సిద్ధమా?
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:13 PM
డీఎస్సీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమనా అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సవాల్ విసిరారు.
మైనార్టీ, న్యాయ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమనా అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సవాల్ విసిరారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీపై చేస్తున్న ఆరోపణలు రుజువు కాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నించారు. నిరసన పేరుతో సృష్టించిన హంగామాను చూసిన ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నంద్యాలలో 15 ఏళ్లు అధికారంలో ఉండి ఏమి అభివృద్ది చేశారో ప్రజలకు తెలుసునన్నారు. రోజుకో పార్టీ మారే మీరు ( శిల్పా ) కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్‌పై బీఎల్‌ఏలు నిశిత పరిశీలనతో పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రక్రియలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలన్నారు. నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ యార్డుకు చెందిన 10షాపులకు వేలం నిర్వహించి ప్రభుత్వానికి లక్షలలో ఆదాయం తెచ్చామన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మునియార్ ఖలీల్, ఉప్పర, సగర కార్పోరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్, గోవింద్‌నాయుడు, మాజీ కౌన్సిలర్లు శ్రీదేవి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.