నాలుగు లైన్ల రోడ్డుకు ఆమోదం తెలపాలి
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:19 PM
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ప్రస్తుతం ఉన్న 2లైన్ల రహదారిని రూ.60కోట్లతో నిర్మించే 4 లైన్లగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కేంద్ర రోడ్లు రవాణా హైవే శాఖ సెక్రటరీ ఉమాశంకర్‌ను కోరారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ప్రస్తుతం ఉన్న 2లైన్ల రహదారిని రూ.60కోట్లతో నిర్మించే 4 లైన్లగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కేంద్ర రోడ్లు రవాణా హైవే శాఖ సెక్రటరీ ఉమాశంకర్‌ను కోరారు. శుక్రవారం ఢిల్లీలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆయనను కలిశారు. బనగానపల్లె రోడ్ల అభివృద్ధికి సహక రించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు, పెండింగ్ పరిష్కారం వంటి అంశాలపై సెక్రటరీతో మంత్రి చర్చించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఒక టాస్క్‌పోర్సు కమిటీని ఏర్పాటుచేసి జాతీయ రహదారుల పనులు పెండింగ్ పనులను పరిష్కరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నూతన ప్రతిపాదనలకు అనుమతులు, పెండింగ్ పనులపై కేంద్ర రవాణా హైవే శాఖ సెక్రటరీ సానుకూలంగా స్పందించారని మంత్రి వెల్లడించారు. ఆర్‌ఆండ్‌బీ ఏపీ చీప్ సెక్రటరీ కృష్ణబాబు ఉన్నారు.