Share News

ఎన్నికలకు తగిన ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Oct 20 , 2026 | 12:23 AM

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.ఏ. సిరి అన్నారు.

ఎన్నికలకు తగిన ఏర్పాట్లు చేయాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏ. సిరి

కర్నూలు కలెక్టరేట్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.ఏ. సిరి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై నోడల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ, భద్రపరచడం, స్ర్టాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల నిర్వహణకు సంబంధించి సంబంధిత నోడల్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జనరల్‌ అబ్జర్వర్‌ బి.అనిల్‌ కుమార్‌ రెడ్డి పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, ర్యాంపుల సదుపాయాలను కల్పించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అవసరమైన కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌, మైక్రో అబ్జర్వర్లు, వీడియో గ్రాఫర్లను నియమించి పర్యవేక్షణ చేపడుతామన్నారు.

బన్నీ ఉత్సవానికి ప్రత్యేక బందోబస్తు: ఎస్పీ

1000 మంది పోలీసులతో పటిష్ట నిఘా

కర్నూలు క్రైం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : దసరా పండుగ సందర్భంగా అక్టోబరు 21వ తేదీ బుధవారం హొళగుంద మండలం దేవరగట్టులో జరిగే మాలమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలకు 1000 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సోమవారం తెలిపారు. బన్నీ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. 110 నైట్‌ విజన్‌ సీసీ కెమెరాలు, 700 ఎల్‌ఈడీ లైట్లు, 10 డ్రోన్‌ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. అలాగే సీసీ కెమెరాలకు ఒక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Oct 20 , 2026 | 12:23 AM