Share News

పారిశ్రామిక విధానంపై ప్రశంసలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 11:32 PM

కూటమి ప్రభుత్వంలోని పారిశ్రామిక విధానంపై పొరుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ప్రశంసలు కురిపిస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

పారిశ్రామిక విధానంపై ప్రశంసలు

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలోని పారిశ్రామిక విధానంపై పొరుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు ప్రశంసలు కురిపిస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్ర మంలో కర్ణాటక తమిళనాడు, తెలంగాణ ప్రజా ప్రతి నిధులతో కలిసి తాను కూడా పాల్గొన్నట్లు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలన్నా.. ఏ రంగలో పెట్టాన్నా సింగిల్‌విండో ద్వారా వెంటే అనుమతులు మంజూరు చేస్తామని అన్నారు. విజనరీ లీడర్‌ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు పూర్తి అనుకూలమైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. ఏపీలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 11:32 PM