రెగ్యులర్ ఆర్డీవోను నియమించాలి
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:49 PM
2025 డిసెంబర్31న బనగానపల్లె రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాలను కలిపి డివిజన్‌ను ఏర్పాటు చేశారు. అయితే రెగ్యులర్ ఆర్డీవోను మాత్రం నియమించలేదు.
ఇన్‌చార్జిగా డోన్ ఆర్డీవో
పనులు కాక అవస్థలు పడుతున్న రైతులు, ప్రజలు
బనగానపల్లె, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): 2025 డిసెంబర్31న బనగానపల్లె రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాలను కలిపి డివిజన్‌ను ఏర్పాటు చేశారు. అయితే రెగ్యులర్ ఆర్డీవోను మాత్రం నియమించలేదు. అయితే రెవెన్యూ ఉన్నతాధికారులు ఇన్‌చార్జిగా ఆర్డీవోగా డోన్ ఆర్డీవో నరసింహులును నియమించి చేతులు దులుపుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకే అధికారికి డోన్, బనగాగానపల్లె డివిజన్లు చూడడం భారంగా మారింది. రెవెన్యూ అధికారులు, కలెక్టర్ స్పందించి, రెగ్యులర్ ఆర్డీవోను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.