Share News

అర్జీలను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:04 AM

అర్జీలను త్వరగా పరిష్కరించాలని నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు.

అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): అర్జీలను త్వరగా పరిష్కరించాలని నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు. సోమ వారం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని సమావేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కాల నీలకు సంబం ధించి 13 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజా రోగ్య అధికారి డాక్టర్‌ ఎం.రఘు, మేనేజర్‌ చిన్నరాముడు, కార్యదర్శి నాగరాజు, ఆర్‌ఓ స్వర్ణలత, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్‌ బాషా, టిడ్కో అధికారి పెంచలయ్య, సర్వేయర్‌ మద్దిలేటి పాల్గొన్నారు.

ఫ నగరంలోని రాంనగర్‌, చంద్రమౌళీశ్వర్‌ నగర్‌లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇరిగినేని పుల్లారెడ్డి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

ఫ స్వచ్ఛాంద్ర క్లాప్‌ డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని సీఐటీయూ నగర కార్యదర్శి విజయ రామాంజనేయులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పెండింగ్‌ జీతాలు విడుదల చేయాలన్నారు.

ఫ కొత్తబస్టాండు వెళ్లే రహదారిలో సుందరయ్య సర్కిల్‌ను అభివృద్ధి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యుడు పీఎస్‌.రాధాక్రిష్ణ, టి.రాముడు, ఎండీ ఆనంద్‌బాబులు కమిషనర్‌ను కోరారు. కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి.గురుశేఖర్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, హుస్సేన, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:04 AM