అర్జీలను గడువులోగా పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:25 PM
ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను నిర్ధేశిత గడువు లోగా పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబు లేసు అధికా రులను ఆదేశించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను నిర్ధేశిత గడువు లోగా పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబు లేసు అధికా రులను ఆదేశించారు. స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి కమిషనర్ 18 అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ నగర ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, ఎస్‌ఈ జే.రమణమూర్తి, డీసీపీ షబ్న మ్ శాసి్త్ర, ఏసీపీ నాగరాజు, మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఎం రఘు, కార్యదర్శి నాగరాజు, మేనేజర్ జునైద్, ఆర్‌ఓలు, వాజిద్, క్రిస్టోఫర్, సర్వేయర్ మద్దిలేటి, టిడ్కో అధికారి పెంచలయ్య, మెప్మా సీఎంఎం సుధాకర్ పాల్గొన్నారు.