Share News

విద్యార్థులకు అపార్‌ ఐడీ తప్పనిసరి

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:54 PM

అకడమిక్‌ పాస్‌ పోర్టుగా ఉపయోగపడే అర్‌ ఐడీ విద్యార్థులందరికీ ఉండాలని ఉపకులపతి వి. వెంకట బసవరావు అన్నారు.

విద్యార్థులకు అపార్‌ ఐడీ తప్పనిసరి
సమావేశంలో మాట్లాడుతున్న ఉపకులపతి

ఆర్‌యూలో ఉపకులపతి వి. వెంకట బసవరావు

కర్నూలు అర్బన్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): అకడమిక్‌ పాస్‌ పోర్టుగా ఉపయోగపడే అర్‌ ఐడీ విద్యార్థులందరికీ ఉండాలని ఉపకులపతి వి. వెంకట బసవరావు అన్నారు. సోమవారం రాయలసీమ యూనివర్సిటీ సెనేట్‌ హాలులో ఉన్నత విద్యా మండలి, నేషనల్‌ అకడమిక్‌ డిపాజిటరీ సహకారంతో అపార్‌ క్రెడిట్‌ గురించి నిర్వహించిన ఒక్క రోజు వర్క్‌ షాప్‌ను ఆయన ప్రారంభించారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగం గా భాతర ప్రభుత్వం చేపట్టిన వన్‌ స్టూడెంట్‌ -వన్‌ ఐడీ కార్యక్రమంలో భాగంగా అపార్‌ ఐడీ, నేషనల్‌ అకడమిక్‌ డిపాజిటరీల ఏర్పాటు జరిగిం దన్నారు. ప్రతి ఉన్నత విద్యా సంస్థ ఇందులో భాగస్వాములు కావడం ద్వారా విద్యార్థుల సర్టిఫిక్లె జారీ, పరిశీలన తదితర అంశాలు సులభతరం అవుతాయన్నారు. డిజిట్‌ ఇండియా కార్పొరేషన్‌ రాష్ట్ర సమన్వయ కర్త రవి పాండే మాటాలడుతూ డిజి లాకర్‌, అకడమిక్‌ బ్యాంక్‌ ఆప్‌ క్రేడిట్స్‌, నేషనల్‌ అకడమిక్‌ డిపాజిటరీ, అపార్‌ ఐడి తదితర అంశాలపై వర్శిటీలు, కాలేజీల నోడల్‌ అధికారులకు అవగాహన ఉండాలన్నారు. విద్యార్థులకు ఏ విధమైన సాయం కావాలన్నా 18008893511 టోల్‌ ప్రీ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ టీకే నాయక్‌, రిజిస్ట్రార్‌ బి. విజయకుమార్‌, డీన్లు సీవీ కృష్ణారెడ్డి, భరత్‌ కుమార్‌, ప్రిన్సిపాల్స్‌ వెంకట సుందరానంద పుచ్చా, సి. విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 11:54 PM