ప్రగతి బాటలో ఏపీ
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:38 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తోందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
కోవెలకుంట్ల, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తోందని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం కోవెలకుంట్లలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి బీసీ మాట్లాడారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నార న్నారు. రాష్ట్రం, నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంటే మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అభివృద్ధి ఎక్కడ జరగలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనపై 10 కేసులు పెట్టారని, కూటమి ప్రభుత్వం అధికారం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా నేటికీ మాజీ ఎమ్మెల్యే కాటసానిపై ఒక కేసు కూడా పెట్టించలేదన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో టీడీపీ జెండా రెపరెపలాడాలని అన్నారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల సొసైటీ చైర్మన్ గువ్వల సుబ్బారెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌ఏ గఫూర్, మండలాధ్యక్షుడు గడ్డం నాగార్జునరెడ్డి, గాధంశెట్టి రమణయ్య, పెనుగొండ రాజశేఖర్, కరిమద్దెల మురళి పాల్గొన్నారు.