Share News

ఏపీ ఎన్జీవో నాయకుల రక్తదానం

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:59 AM

రక్తదానం ప్రాణదానమని, అత్యవసర సమయాల్లో ప్రాణాలను తిరిగిఇస్తుందని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.కె.వెంకటేశ్వర్లు అన్నారు.

ఏపీ ఎన్జీవో నాయకుల రక్తదానం
రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న సూపరింటెండెంట్‌

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రాణదానమని, అత్యవసర సమయాల్లో ప్రాణాలను తిరిగిఇస్తుందని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.కె.వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపర్తి విద్యా సాగర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని కర్నూ లు బ్లడ్‌బ్యాంక్‌లో నాయకులు రక్తదానం చేశారు. జిల్లా అఽధ్యక్షుడు ఎంసీ కాశన్న, ఆర్‌ఎంవో వెంకటరమణతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఏపీఎన్జీవో అసోసియేషన్‌ తరపున వంద మంది రక్తదా నం చేయడం అభినందనీయమన్నారు. జిల్లా అఽధ్యక్షుడు ఈశ్వరయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, సంయుక్త కార్యదర్శి కృష్ణుడు, నర్సెస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి సి. బంగారి, కోశాఽధికారి లక్ష్మినరసమ్మ, నగర ఆధ్యక్షులు టి.గోవిందస్వామి, బీసీ వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రాజు, ఎపీఎన్జీవో నాయకులు శ్రీనివాస యాదవ్‌, విజయకృష్ణ, హైమావతి, రామతులసి పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 12:59 AM