శ్రీశైలంలో ఏపీ మంత్రి సంధ్యారాణి
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:09 AM
నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు.
శ్రీశైలం ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన గోపురం వద్దకు కుటుంబ సభ్యులతో చేరుకున్న వారికి అర్చక వేదపండితులు తిలకధారణ చేయగా ఏఈవో వెంకటేశ్వరరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి, కుటుంబ సభ్యులు.. మల్లికార్జునస్వామికి పంచామృతాభిషేకం, విశేష పూజలు చేశారు. అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని మంగళ హారతులు సమర్పించారు. ప్రాకారంలోని పరివార ఆలయాలను దర్శించుకుని విశేషార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో వేదపండితులు వేదాశీర్వచనాలు వల్లించి తీర్థప్రసాదాలతో పాటు పరిమళ విభూది, శేషవస్త్రాలు, జ్ఞాపికను అందజేశారు. క్షేత్ర విశేషాలను పొందుపరిచిన శ్రీశైలం కాఫీ టేబుల్ బుక్‌ను వారికి అందజేశారు.