Share News

పాముకాటు బాధితులకు ఊరట

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:03 AM

ఇటీవల పాముకాటుతో వ్యవసాయ కూలీలు, రైతులు మృత్యువాత పడుతున్నారు. పాము కరచిన తర్వాత ఆసుపత్రికి తరలించేందుకు సమయం పడుతుండటంతో బాధితులు మరణిస్తున్నారు

పాముకాటు బాధితులకు ఊరట
యాంటీ వీనమ్‌ ఇంజెక్షన్‌

108 వాహనంలో సిద్ధంగా యాంటీ వీనమ్‌ ఇంజెక్షన్‌

ప్రాణనష్టం నివారణకు ప్రభుత్వం చర్యలు

చాగలమర్రి, ఆక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పాముకాటుతో వ్యవసాయ కూలీలు, రైతులు మృత్యువాత పడుతున్నారు. పాము కరచిన తర్వాత ఆసుపత్రికి తరలించేందుకు సమయం పడుతుండటంతో బాధితులు మరణిస్తున్నారు. దీంతో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో బాగంగా 108 వాహనంలోనే యాంటీ వీనమ్‌ విరుగుగు ఇంజెక్షన్‌ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.

తక్షణ వైద్యసాయం

మండలంలోని ఏ ప్రాంతం నుంచి అయినా పాముకాటు బాధితులు 108 కు పోన్‌ చేసిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని యాంటీ వీనమ్‌ ఇజక్షన్‌ ఇస్తారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తారు. తక్షణం ఇంజెక్షన్‌ ఇస్తే బాధితుడు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. జిల్లాలో 30 వాహనాలలో విరుగుడు ఇజక్షన్‌ ఏర్పాటు చేశామని వైద్యాధికారులు తెలిపారు. ఇటీవల రుద్రవరం, గడివేముల ప్రాంతాలలో బాధితులకు వెంటనే ఇంజెక్షన్‌ ఇచ్చి ప్రాణాలు కాపాడామని తెలిపారు.

ఇంజెక్షన్‌ వేస్తే ప్రాణహాని తప్పుతుంది

పాముకాటు బాధితుడికి యాంటీ వీనమ్‌ ఇంజెక్షన్‌ ఇస్తే ప్రాణహాని తప్పుతుంది. విషం శరీరంలోకి పోకుండా ఇంజక్షన్‌ కాపాడుతుంది. అనంతరం వైద్యశాలలో బాధితుడికి పలురకాల చికిత్సలు చేయాలి. విషపురుగుల్లో రకాలు ఉండడం వల్ల రెండు రోజులపాటు రక్త పరీక్షలు చేసి చికిత్స అందిస్తాం. - డాక్టర్‌ ప్రత్యూష, వైద్యాధికారి

Updated Date - Oct 05 , 2026 | 12:03 AM