మరో నీటి నాటకం
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:12 PM
డీఎస్సీ తరహాలో మరో నీటి నాటకానికి వైసీపీ నాయకులు తెరలేపారని రాష్ట్ర మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.
రైతులను తప్పుదోవ పట్టించిన వైసీపీ నాయకులు
‘గోరుకల్లు’కు నీరు తెచ్చిన ఘనత చంద్రబాబుదే
మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి
నంద్యాల రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ తరహాలో మరో నీటి నాటకానికి వైసీపీ నాయకులు తెరలేపారని రాష్ట్ర మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురా లు గౌరు చరితారెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోస మే వైసీపీ నేతలు ఈ ఆరాటాలు చేస్తున్నారన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయని ఆవేదన వ్యక్తం చేశా రు. ఈవిషయంపై రైతులను తప్పుదోవ పట్టించడానికి వైసీపీ నాయకులు రోడ్డెక్కి తమాషా చూస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణాల కోసం ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ల్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను గమనించి భారీగా పెట్టుబడులు పెట్టడానికి పారి శ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. పట్టిసీమ వల్ల రాయలసీమకు జరిగే లాభాలను గతంలో వైసీపీ నేతలే కొనియాడిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. గోరుకల్లు రిజర్వాయర్‌కు రూ.470కోట్లు వెచ్చించి 10నుంచి 13 టీఎంసీల నీరు తీసు కొచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. జీఎన్‌ఎ్‌సఎ్‌స ద్వారా పులివెందులకు నీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ తుంగభద్రలో గేట్లు కొట్టుకొనిపోతే కేవలం మూడు రోజుల్లో గేట్టు ఏర్పాటుచేసి 55టీఎంసీల నీటిని అదుపు చేశారన్నారు. శ్రీశైలం ఎమ్యెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు కురువని సమయంలో పంటలు సాగు చేసుకోవాలని తప్పుడు సలహాఇచ్చి పారిపోయిన శిల్పా చక్రపాణిరెడ్డి నేడు రైతుల పక్షాన నిలుస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. డోన్ ఎమ్యెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ ముందుగా తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నందికొ ట్కూర్ ఎమ్యెల్యే గిత్దా జయసూర్య మాట్లాడుతూ రాయలసీమ ద్రోహి జగన్ అన్నారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ ప్రదాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ పాల్గొన్నారు.