Share News

ఆలూరులో మరో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు

ABN , Publish Date - Apr 10 , 2026 | 10:57 PM

ఆలూరు నియోజకవర్గంలో మరో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు రానుంది.

ఆలూరులో మరో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు

360 మెగా వాట్స్‌ ఉత్పత్తి చేయనున్న ఎస్సార్‌ రెన్యూవబుల్స్‌ హైబ్రిడ్‌ వన్‌ లిమిటెడ్‌

ఎకరాకు రూ.31 వేలు లీజు

మంత్రివర్గం ఆమోదం

కర్నూలు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గంలో మరో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు రానుంది. ఎస్సార్‌ రెన్యూవబుల్స్‌ హైబ్రిడ్‌ వన్‌ లిమిటెడ్‌ సంస్థ ఆలూరు, హత్తిబెళగల్‌, పెద్దహోతూరు గ్రామాల సరిసరాల్లో 360 మెగావాట్స్‌ సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తోది. ఆ సంస్థకు అవసరమైన ప్రభుత్వ, ఇప్పటికే కేటాయించిన భూములకు ఏడాదికి ఎకరాకు రూ.31 వేలు లీజు చెల్లించేందుకు శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. రెండేళ్లకు ఒకసారి లీజు మొత్తం 5 శాతం పెంచేలా నిర్ణయించారు. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఇప్పటికే ఎస్సార్‌ సంస్థ రైతుల నుంచి ప్రైవేటు భూములు సేకరిస్తోంది. ఆ భూముల మధ్యలో ఉన్న ప్రభుత్వ భూములు, ఇతరులకు కేటాయించిన భూములను లీజుకు కేటాయించాలని ఆ సంస్థ అభ్యర్థించింది. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024 నిబంధనల మేరకు మంత్రివర్గం లీజుకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి మండలాల్లో సోలార్‌, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నాయి.

Updated Date - Apr 10 , 2026 | 10:57 PM