Share News

నగర ప్రగతిలో మరో మైలురాయి

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:50 PM

నగరంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో నగర పాలక సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకోనుందని కమిషనర్‌ చల్లా ఓబులేసు పేర్కొన్నారు.

నగర ప్రగతిలో మరో మైలురాయి
బైపాస్‌ రహదారిని పరిశీలిస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

కార్పొరేషన కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): నగరంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో నగర పాలక సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకోనుందని కమిషనర్‌ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. మంగళవారం ఆయన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆధునీకీకరించిన గడియారం ఆసుపత్రి, చౌరస్తా ఆంజనే యస్వామి ఆలయం వెనుక నిర్మించిన నూతన బైపాస్‌ రహదారి, అలాగే కొండారెడ్డి బురుజు ఓపెన థియేటర్‌ పా ర్కులో ఏర్పాటు చేసిన ఔట్‌డోర్‌ ప్రొజెక్షన స్ర్కీనను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత బుధవారం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. గడియారం ఆసుపత్రి ఆధునీకీ కరతో ప్రజలకు మరింత మెరుగన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, నూతన బైపాస్‌ రహదారితో ట్రాఫిక్‌ రద్దీ తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుం దన్నారు. కొండారెడ్డి బురుజు ఓపెన థియేటర్‌ పార్కులో ఏర్పాటు చేసిన ఔట్‌డోర్‌ ప్రొజెక్షన స్ర్కీన ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్ర మాలు, సాంస్కృతిక, వినోదాత్మక ప్రదర్శనలు నిర్వ హించే అవకాశం కలుగుతుందన్నారు. ఆయన వెంట ప్రజారోగ్య అఽధికారి డా.ఎం.రఘు, ఏసీపీ నాగరాజు, డీఈఈ శ్రీనివాసన, శానిటరీ ఇనస్పెక్టర్లు రవి, మునిస్వామి, వలి, లోకేశ ఉన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 11:50 PM