Share News

‘సీమ’ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి

ABN , Publish Date - May 17 , 2026 | 12:09 AM

రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేసి కర్నూలును రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

‘సీమ’ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి
మాట్లాడుతున్న కుంచం వెంకటసుబ్బారెడ్డి

చాగలమర్రి, మే 16 (ఆంధ్రజ్యోతి): రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేసి కర్నూలును రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం చాగలమర్రిలోని హైవే డాబా వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 12జిల్లాలతో కలిపి రాయల సీమను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ లేకుండా రాజధానిగా చేయాలని అన్నారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కోసం, ఎరువుల నాణ్యత, నీటి పారుదల మెరుగు కోసం నిరంతరం ఇంజనీర్లతో మాట్లాడుతూ రాయలసీమలో నీటిబాధలు తెలిసిన వ్యక్తిగా పోరాటం చేస్తున్నామన్నారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ అంటూ లక్షల కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. త్వరలో జై రాయలసీమ నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు.

Updated Date - May 17 , 2026 | 12:09 AM