Share News

23 నుంచి అంగనవాడీల దీక్షలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:17 AM

కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయా లని కోరుతూ ఈనెల 23 నుంచి అంగనవాడీ ఉద్యోగులు దీక్షలు చేపట్టనున్నారు.

23 నుంచి అంగనవాడీల దీక్షలు
ఐసీడీఎస్‌ పీడీకి వినతి పత్రం ఇస్తున్న నాయకులు

కర్నూలు హాస్పిటల్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయా లని కోరుతూ ఈనెల 23 నుంచి అంగనవాడీ ఉద్యోగులు దీక్షలు చేపట్టనున్నారు. గురువారం రాష్ట్ర అంగనవాడీల సమితి పిలుపు మేరకు ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు సంబంధిత సీడీపీవో కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ, సీఐటీ యూసీ, ఐఎఫ్‌టీయూ అంగనవాడీ ఉద్యోగుల సంఘం నాయకులు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయకు వినతి పత్రం సమర్పించారు. ఏపీ అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన (ఏఐటీయూసీ) రాష్ట్ర నాయకులు జే.లలితమ్మ, జిల్లా కార్యదర్శి చౌడేశ్వరి, అంగనవాడీ వర్కర్స్‌ యూనియన జిల్లా కార్యదర్శి దుర్గా, సీఐటీయూ జిల్లా అద్యక్షులు పీఎస్‌ రాధాకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్‌.మునెప్ప మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 27 వరకు రిలేదీక్షలు, 27న చలో కలెక్టరేట్‌ నిర్వహిస్తామన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:17 AM