అంగన్‌వాడీ టీచర్లను విడుదల చేయాలి
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:30 PM
అక్రమంగా అరెస్టు చేసిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను వెంటనే విడుదల చేయాలని కార్మిక సంఘాల నాయకులు డి మాండ్ చేశారు.
కార్మిక సంఘాల డిమాండ్
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా అరెస్టు చేసిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను వెంటనే విడుదల చేయాలని కార్మిక సంఘాల నాయకులు డి మాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌ఎస్సీ కార్మిక సంఘాల అధ్వర్యంలో ఏఐటీ యూసీ నగర కార్యదర్శి వెంకటేష్, సీఐటీయూ నగర కార్యదర్శి నరసింహులు అధ్యక్షతన ఽధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్. మునెప్ప, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చౌడేశ్వరి మాట్లాడుతూ శాంతియుతంగా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్ల దీక్షలను భగ్నం చేసేందుకు తెల్లవారుజామున విజయవాడ టెంట్‌లో ఉన్న టీచర్లను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి. అంజిబాబు, శ్రామిక మహిళా రాష్ట్ర నాయకురాలు పి. నిర్మల, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు భాస్కర్ పాల్గొన్నారు.