ముగిసిన అంగన్‌వాడీల దీక్షలు
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:11 AM
Kurnool News
ఆత్మకూరు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మూడు రోజులుగా చేస్తున్న అంగన్‌వాడీల దీక్షలు బుధవారం ముగిశాయి. సీఐటీయూ నాయకులు రామ్‌నాయక్, రణధీర్, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆత్మకూరు ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు రవణమ్మ, మంజు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో దీక్షలు చేశారు. ఐసీడీఎస్ స్థాపించి 50ఏళ్లు అవుతున్నా, గుర్తించకపోవడం అన్యాయమ న్నారు. బడ్జెట్‌లో ఐసీడీఎ్‌సకు నిధులను పెంచాలని, పెండింగ్ ఉన్న 1810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు.
నందికొట్కూరు: అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని సీఐటీయూ పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం అంగన్వాడీలు ఐసీడీఎ్‌సకు బడ్జెట్ కేటాయించాలని, కనీస వేతనం ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాల కోరుతూ ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీల దీక్షలు మూడరోజుకు చేరింది. దీక్షలకు అంగన్వాడీ యూనియన్ నాయకురాలు శివలక్ష్మి అధ్యక్షత వహించారు. కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి పక్కీర్ సాహెబ్ మాట్లాడుతూ 42 రోజులు సమ్మె చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నేడు టీడీపీ ప్రభుత్వం కూటా అదే వైఖరి వ్యవహరిస్తోందని, అసెంబ్లీని ముట్టడించైనా కనీస వేతనాన్ని సాధించుకుంటా మన్నారు. గురు, శుక్రవారాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామన్నారు. ఆపైన కూడా స్పందించకపోతే మార్చి 2న చలో విజయవాడకు అంగన్వాడీలు సమాయత్తం అవుతారన్నారు. నాయకురాలు రాములమ్మ, సుబ్బమ్మ, పద్మావతి, శ్యామల, తులసి, నాగమణి, ప్రభావతి పాల్గొన్నారు.
మిడుతూరు: వేతనాలు పెంచే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్ బాబు హెచ్చరించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద 3వ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాణెమ్మ, కమల, రవణమ్మ, శైలజ, మహాదేవి, పుణ్యవతి, భాగ్యమ్మ ఉమాదేవి ఉన్నారు.