Share News

ముగిసిన అంగన్‌వాడీల సమ్మె

ABN , Publish Date - Feb 26 , 2026 | 01:09 AM

మూడురోజులుగా చేస్తున్న అంగన్‌వాడీల సమ్మె బుధవారం ముగిసింది. ఎంపీడీవో కార్యాలయం ఎదుట మూడు రోజులుగా వారు నిరసన వ్యక్తం చేశారు

ముగిసిన అంగన్‌వాడీల సమ్మె
డోన్‌లో నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

బనగానపల్లె, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మూడురోజులుగా చేస్తున్న అంగన్‌వాడీల సమ్మె బుధవారం ముగిసింది. ఎంపీడీవో కార్యాలయం ఎదుట మూడు రోజులుగా వారు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, జిల్లా సెక్రటరీ నిర్మలమ్మ, అధ్యక్షురాలు శోభారాణి ప్రాజెక్టు అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, సెక్రటరీ రోజారమణి పాల్గొన్నారు.

డోన్‌ రూరల్‌: అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితమ్మ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి జులైఖ తదితరులు పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ: ఐసీడిఎస్‌ కార్యాలయం ఎదుట పలు గ్రామాలకు చెందిన అంగన్‌వాడి కార్యకర్తలు గత మూడు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం ముగిశాయి. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల 27న కలెక్టర్‌ కార్యాలయం వద్ద రిలేనిరాహర దీక్షలు చేపడతా మన్నారు. బేబి రాజేశ్వరి, చంద్రకళ, సరస్వతమ్మ, శైలజ. సుధామని. లక్ష్మికుమారి, పద్మావతి ఉన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 01:09 AM