‘అనంత’ టమోటా రైతులకు అండగా..
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:06 PM
: అనంతపురం జిల్లాలో టమోటా ధరలు పతనమై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు వారికి అండగా నిలబడ్డారు.
కర్నూలు అగ్రికల్చర్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో టమోటా ధరలు పతనమై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు వారికి అండగా నిలబడ్డారు. ఆ జిల్లా రైతులను ఆదుకునేందుకు రంగంలోకి దిగారు. కిలో రూ.9 నుంచి రూ.10 ప్రకారం ఆ జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసి కర్నూలు జిల్లాలోని రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు కిలో రూ.8కు అమ్మేందుకు చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్ శాఖ ఏడీఎం నా రాయణమూర్తి తెలిపారు. సి.క్యాంపు రైతుబజార్‌కు 20 ట్రేడ్ల ద్వారా టమో టాలను సప్లయ్ చేయగా.. నాలుగు ఆటోలను వినియోగించి ఎస్టేట్ అధి కారి కళ్యాణమ్మ, హార్టికల్చర్ అసిస్టెంట్ శివకుమార్, సెక్యూరిటీ గార్డులు శుక్రవారం సీ.క్యాంపు రైతుబజార్ పరిసర వీధుల్లో విక్రయించారు. కేవలం రూ.8లకే టమోటాలు అమ్ముతుండటంతో వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేశారు. కొత్తపేట, అమీన్ అబ్బాస్‌నగర్ రైతుబజార్లకు 20 ట్రేడ్ల ద్వారా టమోటాలను సప్లయ్ చేశారు. అమీన్ అబ్బాస్‌నగర్ ఎస్టేట్ అధికారి విజయలక్ష్మి, కొత్తపేట రైతుబజార్ ఎస్టేట్‌అధికారి తిరుమల్ పరిసర వీధుల్లో మొబైల్ వ్యాన్లను వినియోగించి అమ్మకాన్ని చేపట్టారు.