Share News

అదుపు కాని తెగులు..

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:12 PM

ఎల్‌నినో ప్రభావంతో అసలే పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు కంది పంటకు తెగులు సోకడంతో గగ్గోలు పెడుతున్నారు. ప్యాపిలి, కలచట్ల, పెద్దపూదిళ్ల, వెంగళాంపల్లి, ఏనుగమర్రి, వెంగళాంపల్లి, ఎర్రగుంట్లపల్లి తదితర గ్రామాల్లో రైతులు ఈ ఖరీ్‌ఫలో దాదాపు 15 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు రూ.20వేలు పెట్టుబడి పెట్టామని తీరా పూత వచ్చే సమయానికి తెలుగు సోకడంతో ఉన్న కాస్త పంట పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

అదుపు కాని తెగులు..

ప్యాపిలి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో అసలే పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు కంది పంటకు తెగులు సోకడంతో గగ్గోలు పెడుతున్నారు. ప్యాపిలి, కలచట్ల, పెద్దపూదిళ్ల, వెంగళాంపల్లి, ఏనుగమర్రి, వెంగళాంపల్లి, ఎర్రగుంట్లపల్లి తదితర గ్రామాల్లో రైతులు ఈ ఖరీ్‌ఫలో దాదాపు 15 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు రూ.20వేలు పెట్టుబడి పెట్టామని తీరా పూత వచ్చే సమయానికి తెలుగు సోకడంతో ఉన్న కాస్త పంట పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. తెగులు నివారణకు రకరకాల పురుగుమందులు పిచికారీ చేసినా అదుపులోకి రావడం లేదని వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట నాశనమవుతుంటే గుండెకోతకు గురవుతున్నామని, వ్యవసాయ అధికారులు పరిశీలించి తెగులు నివారణకు సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:12 PM