దేశానికే ఆదర్శం
ABN , Publish Date - May 29 , 2026 | 11:47 PM
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని మంత్రి నారా లోకేశ్ మహానాడు వేదిక మీద ప్రకటించడం దేశానికే ఆదర్శమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
‘థ్యాంక్యూ లోకేశ్’ పేరుతో మహిళల సంబరాలు
కర్నూలు అర్బన్, మే 29(ఆంధ్రజ్యోతి): రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని మంత్రి నారా లోకేశ్ మహానాడు వేదిక మీద ప్రకటించడం దేశానికే ఆదర్శమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఽథ్యాంక్ లోకేశ్ కార్యక్రమం చేపట్టి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతక ముందుకు ప్ల కార్డులు, బ్యానర్లు పట్టుకుని మహిళలు విశ్వేశ్యరయ్య సర్కిల్‌లో ర్యాలీ నిర్వహిం చారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంటింటికి పరిమితమైన మహిళల్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన ఏకైక పార్టీ తెలుగు దేశం అన్నారు. కేంద్రంలో మహిళా బిల్లు ఆమోదం పొందకపోయినా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పింస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం అభినందనీయమన్నారు. వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కపట్రాళ్ల బొజ్జమ్మ మాట్లాడుతూ దివంగ తనేత ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన మహనీయుడని తెలిపారు. ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ మహానాడు వేదికగా చంద్ర బాబు నాయుడు మహిళలకు ఎన్నో హామీలు ప్రకటిం చడం హర్షించ దగ్గ విషయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కైపా పద్మలతారెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవలక్ష్మి, కోట్ల కవితమ్మ, చిన్నమ్మి, విజయలక్ష్మి, మాలిని తదితరులు పాల్గొన్నారు.