Share News

అంబటి వ్యాఖ్యలు అప్రజాస్వామికం

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:35 AM

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎంపై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని కేడీసీసీబీ చైర్మెన్‌ విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

అంబటి వ్యాఖ్యలు అప్రజాస్వామికం
మాట్లాడుతున్న కేడీసీసీబీ చైర్మెన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి

కర్నూలు రూరల్‌ ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎంపై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని కేడీసీసీబీ చైర్మెన్‌ విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అంబటి వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండిస్తున్నానని, సీఎం అనే గౌరవం లేకుండా మాట్లాడితే ప్రజలు చూస్తు ఊరుకోరని విష్ణువర్దన్‌రెడ్డి హెచ్చరించారు. కల్తీ నెయ్యి కేసులో వైసీపీ నాయకులు దోషులుగా తేలారని, అందుకే డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు వీరిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంబటి రాంబాబు తక్షణమే సీఎంకు క్షమాపణ చెప్పాలని విష్ణువర్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 04 , 2026 | 12:35 AM