Share News

అమరావతి బిల్లు..కూటమి విజయం

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:30 PM

అమరావతి రాజధాని బిల్లు పాస్‌ కావడం కూటమి విజయం అని కుడా చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

అమరావతి బిల్లు..కూటమి విజయం
టీడీపీ కార్యాలయంలో దీపాలు వెలిగించిన నాయకులు

కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

టీడీపీ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

కర్నూలు అర్బన్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని బిల్లు పాస్‌ కావడం కూటమి విజయం అని కుడా చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీకి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కొండారెడ్డి బురుజు నుంచి బైక్‌ ర్యాలీ పెద్ద పార్కు, రాజవిహార్‌, బుధవారపేట, కలెక్టరేట్‌ మీదుగా టీడీపీ కార్యాలయం వరకు కొనసాగింది. అమరావతి ఏపీ రాజధాని అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీతో పాటు లోక్‌సభ, పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లు పాస్‌కావడం చారిత్రక విజయమన్నారు. పార్లమెంట్‌లో కూ డా వైసీపీ ఎంపీలు అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ బాయ్‌ కాట్‌ చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బొందిలి కార్పొ రేషన్‌ చైర్మన్‌ విక్రమ్‌ సింగ్‌, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ధరూర్‌ జేమ్స్‌, కొంకతి లక్ష్మీనారాయణ, సంజీవలక్ష్మి, సూరి మ న్సూర్‌ ఆలీఖాన్‌ , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దీపాలు వెలిగించారు. గురువారం అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై ఇంటింటా దీపాలు వెలింగించే ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకున్నారు.

Updated Date - Apr 02 , 2026 | 11:30 PM