Share News

చదువుతో పాటు కళలు, క్రీడా రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - May 28 , 2026 | 12:23 AM

విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడారంగాల్లో ప్రవేశం ఉంటే వారి సర్వతోముఖాభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తి ఓబులయ్య అన్నారు.

 చదువుతో పాటు కళలు, క్రీడా రంగాల్లో రాణించాలి
పత్తి ఓబులయ్యతో శిక్షణ పొందిన చిన్నారులు

టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తి ఓబులయ్య

కర్నూలు కల్చరల్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడారంగాల్లో ప్రవేశం ఉంటే వారి సర్వతోముఖాభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తి ఓబులయ్య అన్నారు. బుధవారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో కర్నూలులోని సిద్ధేంద్రయోగి కూచిపూడి నృత్య శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం కళాక్షేత్రంలో ఏర్పా టు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పత్తి ఓబు లయ్య మాట్లాడుతూ తెలుగు వారి కీర్తిని ఖండాంతరాలు చాటిన ఘనత కూచిపూడి నృత్యానికి దక్కుతుందని అన్నారు. వేసవిలో విద్యార్థులు సమ యం వృథా చేసుకోకుండా, నృత్య శిక్షణల్లో తర్ఫీదు పొందడం అభినం దనీయమన్నారు. శిక్షణ పూర్తి చేసినవారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కళాక్షేత్రం కార్యదర్శి సి. యాగంటీశ్వరప్ప, ఇతర ప్రతిని ధులు మహమ్మద్‌ మియా, జీవీ శ్రీనివాసరెడ్డి, కేవీ రమణ, పీపీ గురు మూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణలు పూర్తి చేసుకున్న చిన్నారులు ప్రదర్శించిన నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి.

Updated Date - May 28 , 2026 | 12:24 AM