Share News

పసుపు దళంలో ఒక్కడిగా..

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:28 PM

ఓ వైపు ప్రభుత్వ పాలనా వ్యవహారాలు.. మరో వైపు పార్టీ పటిష్టతకు ప్రణాళికలు.. బిజీగా ఉంటూ నిత్య విద్యార్థిలాగా కనిపించే చంద్రబాబు శనివారం ఇలా కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నాయ కులు, కార్యకర్తలతో ఇలా కనిపించారు.

పసుపు దళంలో ఒక్కడిగా..
టీడీపీ క్లస్టర్‌ కో కన్వీనర్లతో సీఎం చంద్రబాబు నాయుడు

ఓ వైపు ప్రభుత్వ పాలనా వ్యవహారాలు.. మరో వైపు పార్టీ పటిష్టతకు ప్రణాళికలు.. బిజీగా ఉంటూ నిత్య విద్యార్థిలాగా కనిపించే చంద్రబాబు శనివారం ఇలా కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నాయ కులు, కార్యకర్తలతో ఇలా కనిపించారు. వేదికపై కూర్చొని ప్రసంగాలు ఇవ్వకుండా కార్యకర్తలు, నాయకులతో పాటే వారి మధ్యే కూర్చొని శిక్షణ శిబిరంలోని విషయాలను ఆసక్తిగా తిలకించారు. శనివారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఓర్వకల్లు మండలానికి చెందిన క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, కోకన్వీర్లకు శిక్షణా శిబిరం జరిగింది. ఈ శిక్షణా శిబిరానికి గుట్టపాడు మాజీ సర్పంచ్‌ నర్ల మోహన్‌ రెడ్డి, నన్నూరు ఖాజామియాతో పాటు క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, కో.కన్వీనర్లు హాజరయ్యారు. శిక్షణ జరుగుతున్న సమయంలో సీఎం చంద్రబాబు ఉన్నట్టుండి హాజరై టీడీపీ శ్రేణులతో పాటు కూర్చొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి)

Updated Date - Apr 11 , 2026 | 11:28 PM