Share News

కూటమిలో కుంపట్లు..!

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:17 AM

ఆదోని నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు కార్యకర్తలకు ఇబ్బందిగా మారాయి. అధిష్ఠానం చురకలు, జిల్లా ఇన్‌చార్జి మ ంత్రి చర్చలు.. సర్దుబాటుతో చేతులు కలిపి సఖ్యతగా వెళ్తున్న కూటమి నాయకుల్లో మళ్లీ విభేదాలు పొడచూపాయి.

కూటమిలో కుంపట్లు..!

నాయకుల మధ్య పెరుగుతున్న దూరం.. అభివృద్ధిపై ప్రభావం

ప్రత్యర్థి పార్టీకి కలసి వస్తున్న కూటమి నేతల విభేదాలు

ఆదోని, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఆదోని నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు కార్యకర్తలకు ఇబ్బందిగా మారాయి. అధిష్ఠానం చురకలు, జిల్లా ఇన్‌చార్జి మ ంత్రి చర్చలు.. సర్దుబాటుతో చేతులు కలిపి సఖ్యతగా వెళ్తున్న కూటమి నాయకుల్లో మళ్లీ విభేదాలు పొడచూపాయి. ఇది ప్రత్యర్థి వైసీపీ బలోపేతానికి కారణం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల అధిష్ఠానం జోక్యం చేసుకొని సమన్వయం చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే క్రమంలో ప్రతిపక్ష వైసీపీ నేతలు కూడా కూటమి నాయకుల మధ్య పరోక్షంగా చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధిపొందెందుకు ఎత్తులు వేస్తున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి దిగజారారు. ఇందుకు మార్కెట్‌ యార్డు వేదికగా మారింది. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో ఆదోనిలో తెలిసారిగా జెండా పాతిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి, టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, జనసేన ఇన్‌చార్జి మల్లప్పల మధ్య దూరం రోజురోజుకు పెరుగుతుంది. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటీ..? అంటూ కూటమి పార్టీల కార్యకర్తలు చర్చించుకోవడం కొసమెరుపు. కూటమిలో కుమ్మలాట వల్ల ప్రతిపక్ష వైసీపీ రాజకీయంగా బలపడుతున్నా అధికార నేతలకు కనువిప్పు కలగలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమన్వయంతో కలసి పని చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని అంతర్గతంగా చర్చించుకోవాలని ఆయా పార్టీ అధిష్ఠానాలు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఆదోని కూటమి నాయకులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణులు బలంగా ఉన్నాయి. టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మౌనం దాల్చారు. తాజాగా ఎమ్మెల్యే పార్థసారఽఽథి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చిందె శారద మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మార్కెట్‌ అభివృద్ధి పనులపై తాను తీసుకున్న నిర్ణయాలను కదంటూ ఎమ్మెల్యే పార్థసారథి అధికారులకు చెప్పి పనులు ఆపేయడం ఎంత వరకు సబబు..? మార్కెట్‌లో ఆయన చెప్పింద వేదంగా మారిందని అంటూ చైర్మన్‌ శారద విలేకరుల సమావేశంలో ఏకరువు పెట్టడం, దానికి ఖండనగా బీజేపీకి చెందిన మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ విజయకృష్ణ ప్రెస్మిట్‌ పెట్టి మార్కెట్‌ యార్డులో చైర్మన్‌ శారద భర్త చిందె శంకర్‌ జోక్యం ఎందుకని నిలదీయడంతో నేతల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. అధిష్ఠానం జోక్యం చేసుకొని ఆదోని నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య సమన్వయం చేయాలంటూ మూడు పార్టీల కార్యకర్తలు, ద్వితీయశ్రేణీ నాయకులు కోరుతున్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:17 AM