Share News

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:08 AM

కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

ప్రతి రైతుకు సాగు నీరు అందిస్తాం

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మిగనూరు రూరల్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఎర్రకోట గ్రామంలో కడిమెట్ల సహకార సంఘం సొసైటీలో రైతులకు యూరియా, డీఏపీని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ముందుగా యూరియా, డీఏపీ గోడౌన్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. కడిమెట్ల సొసైటీకి 54 టన్నుల యూరియా, 24 టన్నుల డీఏపీ మంజూరైందన్నారు. ఈ ఎరువులను రైతులు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. యూరియా, డీఏపీ కొరత ఎక్కడా లేదని, ఎవరైనా ఎరువుల దుకాణదారులు కృత్రిమ కొరతను సృష్టించినా, యూరియా, డీఏపీ కొనుగోలు చేసే రైతులకు మరో రకం మందులను అంటగట్టినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఎల్లెల్సీ ద్వారా సాగునీరు అందజేస్తాం: ఎమ్మెల్యే బీవీ

ఎర్రకోట గ్రామంలోని కడిమెట్ల సహకార సంఘం సొసైటీలో రైతులకు ఎరువులను పంపిణీ చేసిన అనంతరం రైతుల విజ్ఞప్తితో ఎమ్మెల్యే బీవీ ఎర్రకోట, కడిమెట్ల గ్రామాల మీదుగా ప్రవహిస్తున్న ఎంఎ్‌సపీ, డబ్ల్యూ -82, 83, 84 కాలువలను మోటారు సైకిల్‌పై వెళ్లి స్వయంగా పరిశీలించారు. కొన్ని చోట్ల కాలువలు పూర్తిగా డ్రైనేజీని తలపిస్తుండడం, మరికొన్ని చోట్ల కాలువలను కొంతమంది ఆక్రమించడంతో ఆయన ఎల్లెల్సీ అధికారులపై మండిపడ్డారు. ఎల్లెల్సీ ద్వారా రైతులకు సాగు నీరు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో కడిమెట్ల సొసైటీ డైరెక్టర్‌ విరుపాక్షిరెడ్డి, మాజీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, డైరెక్టర్లు మురళీకృష్ణారెడ్డి, కేశన్న, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:08 AM