ఆళ్లగడ్డ అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - May 15 , 2026 | 11:36 PM
: నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి కోవెకుంట్ల రస్తాలో నిర్మించిన రోడ్డును శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, మే 15 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి కోవెకుంట్ల రస్తాలో నిర్మించిన రోడ్డును శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. తాలుకాలో తొమ్మిది రహదారులను రూ.8.80 కోట్లతో నిర్మిస్తున్నామని, త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తెస్తామన్నారు. మాజీ కౌన్సిలర్ హుసెన్‌బాషా, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం
దొర్నిపాడు: సంక్షేమం, అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. శుక్రవారం మండలంలోని డబ్ల్యూ.కొత్తపల్లెలో నూతనంగా నిర్మించిన ఆర్‌అండ్‌బీ రోడ్డును ప్రారంభించారు. డబ్ల్యూ.కొత్తపల్లె నుంచి యాళ్లూరు వరకు రూ.1.50 కోట్ల నిధులతో తారు రోడ్డును నిర్మించామన్నారు. జీనేపల్లె గ్రామానికి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హమీ ఇచ్చారు. ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు ప్రసాద్‌రెడ్డి, అభిలా్‌షరెడ్డి, రమే్‌షరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఏరువ ప్రసాద్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు సిద్ధి సత్యనారాయణ, గంగవరం కృష్ణారెడ్డి, అభిలా్‌షరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, కేసీకెనాల్ డీసీ ఉపాధ్యక్షుడు లింగుట్ల వెంకట్‌నాయుడు, కట్టుబడి బాష, శ్రీను, నారపురెడ్డి, కానాల దస్తగిరి పాల్గొన్నారు.