అన్ని పరీక్షలు అందుబాటులో..
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:40 AM
ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు అందుబాటులో ఉన్నాయని జీజీహెచ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
జీజీహెచ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు
కర్నూలు హాస్పిటల్, జూలై 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు అందుబాటులో ఉన్నాయని జీజీహెచ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం సర్వజన వైద్యశాల ధన్వంతరీ హాలులో వివిద విభాగాల హెచవోడీల తో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో అన్నిరకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, కొందరు పీజీ విద్యార్థులు ప్రైవేటు ల్యాబ్‌లకు పరీక్షలను రాస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నా రు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు, మందులను బయటకు రాయొద్దని ఆదేశించారు. ఆస్పత్రిలో నెక్స్ట్‌జెన ఈ-హాస్పిటల్ డేటా నమోదు శా తం గణనీయంగా పెరిగిందని, ఇందుకు కృషిచేసిన వైద్యులు, సిబ్బం దిని అభినందించారు. హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల బయోమెట్రిక్ ఎఫ్‌ఆర్‌ఎస్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, రోగులకు అవసరమైన మం దులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఓపీకి వచ్చిన రోగులకు అనవస రంగా అల్ర్టాసౌండ్ స్కానింగ్ పరీక్షలు రెఫర్ చేయకూడ దని, అడ్మిషన అయిన రోగుల నిర్ధారణ పరీక్షల రిపోర్టులు 50 శాతం కూడా తీసుకెళ్లడం లేదని, ఈ విధానం మారాలని హెచ్చరిం చారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డా.లక్ష్మీబాయి, డా.నాగే శ్వరరావు, ఆర్‌ఎంవో డా.టీసీ హెచ వెంకటరమణ, డిప్యూటీ సీఎస్ ఆర్‌ఎంవో డా.పద్మజ, హెచవోడీలు పాల్గొన్నారు.