పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:43 PM
కర్నూలు జిల్లాలో పరిషత్ ఎన్నికలను ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పోలింగ్ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ, ఎన్నికల సామగ్రి పంపిణీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
ఈనెల 5న జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో 12,50,166 మంది ఓటర్లు
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
కర్నూలు న్యూసిటీ, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో పరిషత్ ఎన్నికలను ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పోలింగ్ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ, ఎన్నికల సామగ్రి పంపిణీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్.సుధాకర్‌రెడ్డి ముందస్తు ప్రణాళికతో వివిధ విభాగాలను సమన్వయం చేస్తూ ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 26 మండలాల్లో 12,50,166 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 6,21,167, మహిళలు 6,28,834, ఇతరులు 165 ఉన్నారు. 1432 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.
పోలింగ్ కేంద్రాల భద్రతకు ప్రత్యేక చర్యలు
పోలింగ్ కేంద్రాల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచారు. 299 పోలింగ్ కేంద్రాలలో 94 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, 398 పోలింగ్ కేంద్రాలలో 161 సమస్యాత్మక ప్రాంతాలు, 735 పోలింగ్ కేంద్రాలను సాధారణ ప్రాంతాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా భద్రతా చర్యలు పర్యవేక్షణ బలోపేతం చేస్తున్నారు.
రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం
ఎన్నికల నిర్వహణకు అవసరమైన మానవ వనరులను సమకూర్చడంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం 26 మండలాలకు 26 మంది రిటర్నింగ్ అధికారులు, 52 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు 1579 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1579 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 5129 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఈ సంఖ్యలో 20 శాతం అదనపు సిబ్బంది కూడ ఉన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించి, బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత
ఓట్ల పెట్టెల భద్రత, స్ట్రాంగ్‌రూమలు పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భదత్రా ఏర్పాట్లతో పాటు సీసీ కెమెరాల నిఘా, అవసరమైన సిబ్బంది నియామకం వంటి అంశాలను సమన్వయం చేస్తున్నారు. ఎన్నికల సామగ్రిని సురక్షితంగా తరలించడం, స్వీకరణ కేంద్రంలో క్రమబద్ధంగా నమోదు చేయడం, ఓటు పెట్టులను భద్రపరచడం వంటి ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవరించాలని అధికారులకు సూచిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, భద్రత రెండిండికీ సమాన ప్రాధాన్యమిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు
కర్నూలు జిల్లాకు 19.9, నంద్యాల జిల్లాకు 19 మెట్రిక్ టన్నుల బ్యాలెట్ పేపర్ వచ్చింది. కర్నూలు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పెద్దవి 1595, మీడియం 14, చిన్నవి 220 ఉన్నాయి. నంద్యాల జిల్లాకు పెద్ద బ్యాలెట్ బాక్సులు 154, మీడియం, 112, చిన్నవి 139 వచ్చాయి.. నంద్యాల జిల్లాకు బ్యాలెట్ బాక్సులు తక్కువగా ఉన్నందున అక్కడి అవసరాల మేరకు 1500 బాక్సులకు మళ్లి తెప్పించారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అలాగే ఓటరు జాబితాలను ప్రత్యేకించి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటరు జాబితాలను రూపొందించి ఆయా మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రచురించారు.
74 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
కర్నూలు జిల్లాలో 432 ఎంపీటీసీల స్థానాలకు గాను 74 స్థానాలు ఏకగీవ్రం అయ్యాయి. మిగిలిన 358 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కర్నూలు జిల్లాలోని 26 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనునున్నాయి.
మండల కేంద్రంలోనే పంపిణీ కేంద్రం
జడ్పీటీసీ, ఎంపిటీసీల ఎన్నికలకు సంబంధించి ఆయా మండల కేంద్రంలోనే పంపిణీ కేంద్రాన్ని గుర్తించారు. ఎన్నికల సిబ్బందికి ఏ మండలంలో విధులు కేటాయిస్తే అదే మండల కేంద్రంలోని రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకెళ్లాలి. పోలింగ్ అనంతరం అధికారులు గుర్తించిన స్ట్రాంగ్‌రూమ్‌లకు బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లాలి.
326 వాహనాల ఏర్పాటు
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల సిబ్బందిని పంపిణీ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ అనంతరం స్ట్రాంగ్‌రూములకు తీసుకెళ్లే విధంగా సుమారు 326 వాహనాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీఎ్‌సఆర్టీసీ బస్సులు-180, ప్రైవేటు పెద్ద బస్సులు-25, మినీ బస్సులు-75, ఇతర వాహనాలు-120 కేటాయించారు. జిల్లాలో మొత్తం 29 స్ట్రాంగ్ రూములు, 37 కౌంటింగ్ హల్స్, 6 కౌంటింగ్ ప్రాంతాలు, 26 పంపిణీ కేంద్రాలు, 26 రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు 52 ఫ్లయింగ్ స్క్వాడ్, 52 స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిరి సంబంధిత అధికారులకు సూచించారు. 255 మంది మైక్రో అబ్జర్వర్స్‌ను, లీడ్ బ్యాంక్ మేనేజర్ పి.మోహన్‌ను మైక్రో అబ్జర్వర్ నోడల్ అధికారిగా నియమించారు.
నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
ఎన్నికల ప్రక్రియలో ప్రతి అధికారి, సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలి. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి, సమస్యాత్మక కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలి. ఎన్నికల ఏర్పాట్లలో ఏ చిన్న అంశాన్నీ నిర్లక్ష్యం చేయకుండా, సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలి. ఓటర్ల వివరాల నుంచి పోలింగ్ కేంద్రాల భద్రత వరకు, సిబ్బంది శిక్షణ నుంచి కౌంటింగ్ ఏర్పాట్లు వరకు ప్రతి అంశాన్ని సిద్ధం చేసేందుకు జడ్పీ యంత్రాంగం కృషి చేస్తోంది. ముందస్తు ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ, విభాగాల మధ్య సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. - ఆర్.సుధాకర్‌రెడ్డి, జడ్పీటీసీ రిటర్నింగ్ ఆఫీసర్