సమస్యలన్నీ పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:26 PM
అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎ.సిరి అధి కారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎ.సిరి అధి కారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా కలెక్టర్, జేసీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీ ఆర్‌ఎస్‌లో వచ్చిన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి చూపాలన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో వెనుకబడి ఉన్నామని, నిర్మాణాలు వేగ వంతమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జల ధార-జలహారతి కార్యక్ర మంలో భాగంగా అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళికకు సంబంధిం చి గ్రామ పంచాయతీల వారిగా పనులను గుర్తించి మ్యాపులతో సహా వెంటనే నివేదికలను అందించాలని జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం డా.బీఆర్ అంబే డ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనూరాధ, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, జిల్లా అధికా రులు పాల్గొన్నారు.