Share News

అన్ని రకాల అనుమతులున్నాయి

ABN , Publish Date - May 07 , 2026 | 11:07 PM

టీడీపీ కార్యాలయ నిర్మాణానికి మున్సిపల్‌, కుడా నుంచి అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.

అన్ని రకాల అనుమతులున్నాయి
మాట్లాడుతున్న గుడిసె కృష్ణమ్మ

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

ఆదోని, మే 7 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యాలయ నిర్మాణానికి మున్సిపల్‌, కుడా నుంచి అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. గురువారం ఆమె క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు టీడీపీ కార్యాలయ భూమి పూజపై వైసీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. రెండెకరాలు కాదు అని ఒకటిన్నర మాత్రమే టీడీపీ కార్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు. రెండు ఎకరాల స్థలం కేటాయించారని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టంచేశారు. దేశంలోనే అత్యంత అబద్ధాల పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ అని అన్నారు. వైసీపీ హయాంలో నిర్మించిన ఆ పార్టీ కార్యాలయాలకు కనీస అనుమతులు లేవన్నారు. 90 శాతం నిర్మాణం పూర్తయ్యాక నోటీసులు రావడంతో ఆ అక్కసును మాపై వెళ్లగక్కుతున్నారని ఆమె మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిగిలిన కొద్దిపాటి ఉనికిని కూడా కోల్పోక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ నాయకుడు మురళి పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 11:07 PM