‘నీట్’లో మెరిసిన జేపీ సూరజ్
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:23 AM
గత నెల 27న జరిగిన నీట్ సూపర్ స్పెషాలిటీ సర్జికల్ విభాగం జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆదోని పట్టణంలో ఆర్ట్స్ కళాశాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసమున్న యువ డాక్టర్ సూరజ్ జాతీయ స్థాయి నీట్ సూపర్ స్పెషాలిటీ సర్జికల్ విభాగంలో ఆల్ ఇండియా 14వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నారు. తండ్రి, రవిశంకర్ చార్టెర్డ్ అకౌంట్‌గా, తల్లి గృహిణి, సోదరుడు
ఆలిండియా 14వ ర్యాంకు సాధించిన ఆదోని వాసి
ఆదోని అగ్రికల్చర్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): గత నెల 27న జరిగిన నీట్ సూపర్ స్పెషాలిటీ సర్జికల్ విభాగం జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆదోని పట్టణంలో ఆర్ట్స్ కళాశాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసమున్న యువ డాక్టర్ సూరజ్ జాతీయ స్థాయి నీట్ సూపర్ స్పెషాలిటీ సర్జికల్ విభాగంలో ఆల్ ఇండియా 14వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నారు. తండ్రి, రవిశంకర్ చార్టెర్డ్ అకౌంట్‌గా, తల్లి గృహిణి, సోదరుడు అమెరికా గూగుల్ సంస్థలో పనిచేస్తున్నారు. డాక్టర్ జేపీ సూరజ్ ఎంబీబీఎస్ విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు. మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజ్‌లో ఎంఎస్ జనరల్ సర్జన్ ఇటీవలే పూర్తి కావడంతో ఎంఎస్ సర్జికల్ చేయాలన్న సంకల్పంతో జాతీయ స్థాయి పరీక్షలకు సన్నద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా 87 సీట్లు మాత్రమే ఉండే సర్జికల్ గాస్ట్రో ఎంట్రాలజీ లేదా ఆంకాలజీ విభాగానికి పరీక్ష రాసి ఆల్ ఇండియా 14వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఏపీలో కేవలం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో మాత్రమే సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో మూడు సీట్లు ఉంటాయన్నారు. సర్జికల్ గ్యాస్ట్రో సెంట్రాలజీ చేరి కొద్ది రోజులు ప్రాక్టీస్ చేశాక ఆదోనిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రులుసంతోషం వ్యక్తం చేశారు.