Share News

ఆశలన్నీ ఆగస్టుపైనే..

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:44 PM

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులపై ఆధారపడిన వారంతా ఆగస్టు నెలపై ఆశలు పెట్టుకున్నారు.

ఆశలన్నీ ఆగస్టుపైనే..
శ్రీశైలం రిజర్వాయర్‌

ఆల్మట్టి నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు

శ్రీశైలం రిజర్వాయర్‌లో 820అడుగుల నీటి నిల్వ

కృష్ణమ్మ రాక కోసం ఎదురుచూపులు

శ్రీశైలం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులపై ఆధారపడిన వారంతా ఆగస్టు నెలపై ఆశలు పెట్టుకున్నారు. కృష్ణమ్మ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాల ఆగమనం తారుమారైనప్పటికీ కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు గేట్లు తెర చుకోవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కర్ణాటక దాటి తెలంగాణ నుంచి ఆంధ్రా వైపునకు పరుగులు పెడుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 820.90 అడు గుల వరకు మాత్రమే నీటి నిల్వలున్నాయి. ఆల్మట్టి నుంచి రెండు రోజు లుగా విడుదలవుతున్న వరద నారాయణ్‌పూర్‌ దాటుకుని నేడో రేపో జూరాల ప్రాజెక్టుకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు భావి స్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగినట్లయితే జూరాల జలాశయంలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకునేందుకు రెండు మూడు రోజులు పడుతుంది. జూరాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుకు నేందుకు మరో నాలుగైదు రోజులు పట్టవచ్చునని నిపుణుల అంచనా.

Updated Date - Jul 26 , 2026 | 11:44 PM