రైతులందరికీ నష్ట పరిహారం ఇవ్వాలి
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:58 PM
మండలంలోని తిప్పాయిపల్లెలో మెగా కంపెనీ చేపట్టిన పనులతో నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి
ఓర్వకల్లు, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని తిప్పాయిపల్లెలో మెగా కంపెనీ చేపట్టిన పనులతో నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తిప్పాయిపల్లెలో ఆయన బాధిత రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల అనుమతి లేకుండా పొలాల్లో భారీ విద్యుత స్తంభా లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులపై ఓర్వకల్లు ఎస్‌ఐ తన సిబ్బందితో దౌర్జన్యం చేసి స్టేషనలో నిర్బంధించడం దారుణమన్నారు. ఈ ఘటనపై కలెక్టర్ జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కాగన్న, మండల కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం మండలాధ్యక్షుడు మధుసూదన, రైతులు సుంకిరెడ్డి, సుధాకర్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సుంకన్న, చాంద్ బాషా, మద్దిలేటి పాల్గొన్నారు.