Share News

హోమియో వైద్యంతో సర్వ రోగాలు నయం

ABN , Publish Date - Apr 10 , 2026 | 10:58 PM

హోమియో వైద్యంతో అతి తక్కువ ఖర్చుతో సర్వ రోగాలను నయం చేసుకోవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్థి అన్నారు.

హోమియో వైద్యంతో సర్వ రోగాలు నయం
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి

కర్నూలు లీగల్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): హోమియో వైద్యంతో అతి తక్కువ ఖర్చుతో సర్వ రోగాలను నయం చేసుకోవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్థి అన్నారు. ప్రపంచ హోమియో దినోత్సవం సందర్బంగా స్థానిక న్యాయ సేవా సదన్‌ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హోమియో వైద్యం అన్ని వైద్యాల్లో ఉత్తమమైనదన్నారు. హోమియో వైద్యంపై ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు ఉచిత హోమియోపతి వైద్య శిబిరం ఏర్పాటుచేశామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ చిన్నపాటి మందుల తోనే తీవ్రమైన వ్యాధులను సైతం నయం చేయగల శక్తి హోమి యోపతి వైద్యానికి ఉందన్నారు. ప్రభుత్వ హోమియో వైద్యులు డా.మహాదేవరావు మాట్లాడుతూ అన్ని రకాల వ్యాధులను హోమి యో మందులతోనే నయం చేయవచ్చన్నారు. హోమియోపతి డాక్టర్‌ పీవీ హరినాథ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.చంద్రుడు, డా.భారతి తదితరులున్నారు.

Updated Date - Apr 10 , 2026 | 10:58 PM