Share News

రసాభాస

ABN , Publish Date - Nov 20 , 2026 | 10:51 PM

మండల ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎంపిక రసాభాసగా మారింది. టీడీపీ ఎంపీటీసీలు రెండు వర్గాలుగా విడిపోయారు.

రసాభాస
ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బండి మరియమ్మ

ఎట్టకేలకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక

ఎన్నిక పత్రాలను చించేసిన ఓ ఎంపీటీసీ

ఉయ్యాలవాడ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మండల ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎంపిక రసాభాసగా మారింది. టీడీపీ ఎంపీటీసీలు రెండు వర్గాలుగా విడిపోయారు. మండలంలో 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఐదుగురు టీడీపీ, ఇద్దరు వైసీపీ, ఒకరు జనసేన నుంచి గెలుపొందారు. వీరిలో ముగ్గురు ఒక వర్గంగా, మరో ముగ్గరు ఇంకో వర్గంగా మారారు. వైసీపీ ఎంపీటీసీలు ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఎంపీపీ వైస్‌ ఎంపీపీ ఎన్నిక కష్టతరంగా మారింది. ఇరు వర్గాలకు సరియైున బలం లేకపోవటంతో ఎన్నిక ఉదయం నుంచి సజావుగా సాగలేదు. రెండు సార్లు వాయిదా పడు తూ వచ్చింది. ఆళ్లగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు మురళి కలుగజేసుకొని ఎంపీపీ ఒక వర్గానికి, వైస్‌ ఎంపీపీ మరో వర్గానికి ఇచ్చేలా ఒప్పందానికి వచ్చేలా ఓ కొలిక్కి తీసువచ్చాడు. ఇరువురి ఒప్పందం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తరువాత ఎన్నికలు నిర్వహించారు. ఈఎన్నికలో ఒక వర్గానికి చెందిన బండి మరియమ్మను మండల అధ్యక్షురాలుగా, మరో వర్గానికి చెందిన గోపిరెడ్డి హరిప్రసాద్‌రెడ్డిని వైస్‌ ఎంపీపీగా ఎన్నుకున్నారు. వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారిలోని ఓ ఎంపీటీసీ ఎన్నిక పత్రాలను చించేసినట్లు ఆర్వో నాగమునేశ్వరి తెలిపారు. ఈ ఎన్నికలపై, జరిగిన సంఘటనల గురించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. డీఎస్పీ రవికుమార్‌, సీఐలు బీవీ రమణ, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నలుగురు ఎస్‌ఐ, భారీ పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు.

Updated Date - Nov 20 , 2026 | 10:51 PM