‘అక్షరాంధ్ర’ పరీక్ష ప్రశాంతం
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:22 AM
అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అభ్యాస కులకు నిర్వహిస్తున్న పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
జిల్లాలో 99.98 శాతం హాజరు
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
కర్నూలు ఎడ్యుకేషన్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అభ్యాస కులకు నిర్వహిస్తున్న పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆదివారం స్థానిక శ్రీరామ్‌నగర్‌లోని నగర పాలక ఉన్నత పాఠశాలలో అక్షరాంధ్ర అభ్యాసకులకు ఏర్పాటు చేసిన పరీక్ష కేం ద్రాన్ని కలెక్టర్ డా.ఏ.సిరి తనిఖీచేశారు. ఆమె మాట్లాడుతూ అభ్యాసకులు పరీక్షలు బాగా రాస్తున్నట్లు సంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లాలో అభ్యాసకులు 1,62,230 మంది కాగా, 1,62, 204 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 99.98గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1368 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. పరీక్షా కేంద్రా లను జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మెఫ్మా పీడీ శ్రీనివాసులు, ఏపీవోలు తదితరులు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.