సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం
ABN , Publish Date - May 07 , 2026 | 11:57 PM
గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడమే వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ లక్ష్యమని జేసీ నూరుల్ ఖమర్ అన్నారు. గురువారం పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో పర్యటించారు.
జేసీ నూరుల్ ఖమర్
పత్తికొండ, మే 7 (ఆంద్రజ్యోతి): గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడమే వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ లక్ష్యమని జేసీ నూరుల్ ఖమర్ అన్నారు. గురువారం పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో పర్యటించారు. మొదటి విజిట్‌లో సమస్యలు తెలుసుకుంటామని రెండు, మూడు, నాలుగు విజిట్లలో ఆయా శాఖల అధికారులతో సమస్యలు లేకుండా పరిష్కరిస్తామన్నారు. అక్కడి నుంచి పత్తికొండ సమీపంలో జరుగుతున్న రీసర్వే పరిశీలించి రైతులతో మాట్లాడారు. రీ సర్వే అవినీతికి తావు లేకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా చేయాలని సర్వేయర్లను సూచించారు. కోరమండల్ ఎరువుల దుకాణం, హోసూరు హోసూరు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్, ఏవో వెంకట్రాముడు, మండల సర్వేయర్ గాదె లింగప్ప, అధికారులు, సిబ్బంది ఉన్నారు.