Share News

పేదలకు గృహ వసతి కల్పనే లక్ష్యం

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:45 PM

రాష్ట్రంలోని పేదలకు గృహ వసతి కల్పనే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి నగర్‌లో లబ్ధిదారుల గృహ ప్రవేశం నిర్వహించారు.

పేదలకు గృహ వసతి కల్పనే లక్ష్యం
లబ్ధిదారులతో ఎమ్మెల్యే కోట్ల

బేతంచెర్ల, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదలకు గృహ వసతి కల్పనే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి నగర్‌లో లబ్ధిదారుల గృహ ప్రవేశం నిర్వహించారు. అనంతరం 6వ వార్డులో రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. తహసీల్దార్‌ నాగమణి, ఎంపీడీవో ఫజల్‌ రహమాన్‌, టిడిపి మండల కన్వీనర్‌ ఎల్ల నాగయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి, హౌసింగ్‌ డిఈ క్రిష్ణారెడ్డి, ఏఈ కేశవ్‌, సిబ్బంది, టిడిపి నాయకులు రవీంద్ర నాయక్‌, వెంకటేశ్వర ఆచారి పాల్గొన్నారు.

టీడీపీలో చేరిక

ఎమ్మెల్యే కోట్ల, పట్టణ టీడీపీ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి, నాయకులు బుగ్గన ఆనంద్‌ రెడ్డి ఆధ్వర్యంలో బేతంచెర్ల పట్టణంలతోని సుబ్బారెడ్డి నగర్‌, జంగలపేట కాలనీలకు చెందిన శ్రీరాములు, లక్ష్మణ్‌, మధు కిరణ్‌ సమక్షంలో సులోచన, వరాలు, లక్ష్మీదేవి, మంగమ్మ, తదితరులతో కలిసి సుమారు 100 కుటుంబాలు వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కన్వీనర్‌ ఎల్ల నాగయ్య, మాజీ ఎంపీపీ సోమశేఖర్‌ రెడ్డి, టీడీపీ నాయకులు మేకల నాగరాజు, రూబెన్‌, బుగ్గన ప్రభాకర్‌ రెడ్డి, జాకీరుల్లా బేగ్‌, టీడీపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

డోన్‌ టౌన్‌: సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ప్రారంభంచిన పీ-4 కార్యకర్రమం ప్రథమ వార్షికోత్సవాన్ని వెంకటాచలం ఫంక్షన్‌ హాలులో డీఎల్‌డీవో నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్డీవో నరసింహులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మాజీ సర్పంచ్‌ పెద్ద కేశవయ్యగౌడ్‌, కమిషనర్‌ ప్రసాద్‌గౌడు, బీజేపీ నాయకులు సంధు వెంకటరమణ, ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, ప్యాపిలి ఎంపీడీవో శ్రీనివాసులు, బేతంచెర్ల ఎంపీడీవో ఫజుల్‌ రెహిమాన్‌, తహసీల్దార్లు నాగమణి, రవికుమార్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సలీంధ్ర శ్రీనివాసులు, టీడీపీ నాయకులు, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

ఉడుములపాడు గ్రామం రైతుభరోసా కేంద్రంలో డోన్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం ఎమ్మెల్యే ప్రారంభించారు. మార్కెట్‌ యార్డు చైర్మన్‌ రాజా సుజాత, సర్పంచ్‌ రాధమ్మ, రాజా నారాయణమూర్తి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చనుగొండ్ల శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 11:45 PM