Share News

ఆధునిక వైద్యం ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:48 PM

ఆధునిక వైద్యసేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. మంగళవారం ఉదయం కర్నూలు మెడికల్‌ కాలేజీలో అత్యాధునిక సదుపాయాలతో రూ.66 లక్షల ఖర్చుతో నిర్మించిన వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌్‌ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

ఆధునిక వైద్యం ప్రభుత్వ ధ్యేయం
ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న మంత్రి టీజీ భరత్‌, కర్నూలు ఎంపీ నాగరాజు

మంత్రి టీజీ భరత్‌

కర్నూలు మెడికల్‌ కాలేజీలో వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ ప్రారంభం

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఆధునిక వైద్యసేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. మంగళవారం ఉదయం కర్నూలు మెడికల్‌ కాలేజీలో అత్యాధునిక సదుపాయాలతో రూ.66 లక్షల ఖర్చుతో నిర్మించిన వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌్‌ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాబ్‌ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పటికే రోగులకు మంచి సేవలు అందిస్తూ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. ఆసుపత్రిలో సీఎ్‌సఆర్‌ నిధులు వెచ్చించి వెంటిలేటర్లు, అల్ర్టాసౌండ్‌ యంత్రాల మిషన్ల ఏర్పాటు ప్రమాదకర స్థితిలో ఉన్న 21 భవనాల స్లాబ్‌లను బలపరిచే పనులు కొనసాగుతున్నాయన్నారు. మెడికల్‌ కాలేజీలో 70 సెంట్ల స్థలంలో విదేశాల్లో ఉన్న కేఎంసీ పూర్వ విద్యార్థుల నిధులు రూ.50 కోట్లతో ఆధునిక నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కర్నూలులో సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోనే అత్యధిక ఓపీ సేవలు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల రాష్ట్రంలోనే అత్యధిక ఓపీ సేవలు అందిస్తున్న ఆసుపత్రిగా గుర్తింపు పొందిందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఇటీవల జరిపిన చర్చల్లో రాష్ట్రంలోనే అత్యధిక రోగులు వచ్చే ప్రధాన ఆసుపత్రిగా అభివర్ణించారన్నారు. సీఆర్‌ఎస్‌ నిధులతో వెంటిలేటర్‌ సమస్యతో పాటు నర్సింగ్‌ కాలేజీ విద్యార్థుల కోసం ఎంపీ నిధులతో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌ డా.కే. చిట్టినరసమ్మ, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు, మైక్రోబయాలజీ హెచ్‌వోడీ డా.ఏ. రేణుకాదేవి, స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డా. కృష్ణ ప్రకాష్‌, ఐ-హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డా.సత్యనారాయణ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.ఎస్‌. లక్ష్మీబాయి, ఏపీఎఎంఎ్‌సఐడీసీ ఎస్‌ఈ ఇందిర, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ చిరంజీవులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 11:48 PM