Share News

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:08 AM

గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, టీడీపీ కార్యదర్శి బ్రాహ్మనందరెడ్డి తెలిపారు

గ్రామాల అభివృద్ధే లక్ష్యం
ముత్యాలపాడులో పనులు ప్రారంభిస్తున్న టీడీపీ నాయకులు

మండలాల్లో పల్లె పండుగ పనులు ప్రారంభం

చాగలమర్రి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, టీడీపీ కార్యదర్శి బ్రాహ్మనందరెడ్డి తెలిపారు. గురువారం ముత్యాలపాడు గ్రామంలో పల్లెపండుగ 3.0 ద్వార మంజూరైన రూ.30 లక్షల రోడ్డు పనులను వారు ప్రారంభించారు. ఎం.తండాలో రూ.25 లక్షలు, చక్రవర్తుపల్లెలో రూ.5 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభించారు. 19 గ్రామ పంచాయతీల్లో 40 పనులకు రూ.3.15 కోట్లు పల్లె పండుగ నిధులు మంజూరయ్యాయని పీఆర్‌ ఏఈ కొండారెడ్డి తెలిపారు. డి.వనిపెంట, గొడిగనూరు గ్రామాల్లో టీడీపీ నాయకులు శేఖర్‌రెడ్డి, గోపాల్‌ ఆధ్వర్యంలో రోడ్డు పనులు ప్రారంభించారు. టీడీపీ నాయకులు పరమేశ్వర్‌రెడ్డి, మాబుబాష, చాంద్‌బాష, నరసింహుడు, మహమ్మద్‌బాష, గుర్రప్ప, కార్యదర్శి ప్రదీ్‌పకుమార్‌రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శిరివెళ్ల: మండల కేంద్రంలో రూ.90 లక్షలతో సీసీ రహదారులు నిర్మిస్తున్నట్లు టీడీపీకన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. స్థానిక అమ్మవారిశాల పక్కన రహదారి నిర్మాణానికి ఆయన గురువారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మాజీ జడ్పీటీసీ యామాగుర్రప్ప, సూరా రామ, ఫిదా హుసేన్‌, యామా శ్రీకాంత్‌, బాలచంద్రుడు, సూరా శ్రీనివాసులు, ఉల్లి వెంకటసుబ్బయ్య, కరీం, సిద్ధిఖ్‌, జిక్రియా, ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప ఉన్నారు.

సంజామల: గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నాయకుడు కానాల కేశవ రెడ్డి అన్నారు. ఎంపీడీవో సాలమోన్‌, అధికారులు, గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి, మంగపల్లెలో పైపు కల్వర్టు ఏర్పాటుకు భూమిపూజ చేశారు. మొత్తం సీసీ, బీటి రోడ్లు, గోకులాలు, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకం, బస్సు షెల్టర్లు, పంచాయతీ భవనాలు నిర్మిస్తామన్నారు. పశువైద్యాధికారులు కృష్ణ కుమార్‌, డిప్యూటీ ఎంపీడీవో సురే్‌షబాబు, పంచాయతీరాజ్‌ ఏఈ రషీద్‌, ఏపీవో ప్రకాష్‌, నాయకులు పార్ధసారధి రెడ్డి, మోహన్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

దొర్నిపాడు: చాకరాజువేముల, దొర్నిపాడు, బుర్రారెడ్డిపల్లె గ్రామాల్లో టీడీపీ నాయకులు లింగుట్ల వెంకట్‌నాయుడు, సిద్ధి సత్యం, నారపురెడ్డి ఇన్‌చార్జి ఎంపీడీవో శివప్రసాద్‌ ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణపు పనులను ప్రారంభించారు. మండలానికి రూ.2.53 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. డీలర్‌ రమణయ్య, కామసాని నారపురెడ్డి, సుబ్బారెడ్డి, జవహర్‌రెడ్డి, బూషిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులు, ఉసేన్‌వలి, కార్యదర్శులు నాగార్జున, మధు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ హసన్‌ ఉన్నారు.

అవుకు: పట్టణంలోని ఈబీసీ కాలనీలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయభాస్కర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు ఉగ్రసేనారెడి,్డ తహసీల్దార్‌ ఫకీర్‌అహ్మద్‌, ఎంపీడీవో రామకృష్ణవేణితో కలసి సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. మండలానికి రూ.2కోట్ల పల్లె పండుగ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈవో విజయకుమారి, టీడీపీ నాయకులు దంతెలరమణ, రంగస్వామిగౌడు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

రుద్రవరం: చిలకలూరు గ్రామంలో రూ.30ల క్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులను టీడీపీ నాయకులు అధికారులు ప్రారంభించారు. జిల్లాఆర్గనైజింగ్‌ సెక్రటరీ ముళ్లరజాక్‌, పీఆర్‌ ఏఈ కమాల్‌సాహెబ్‌, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్‌రెడ్డి, బాలాంజనేయులు పంచాయతీ కార్యర్శి మహేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 12:08 AM