Share News

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:56 AM

రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
చంద్రబాబు, లోకేశ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న మంత్రి టీజీ భరత్‌

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన నేపథ్యంలో నగరంలోని మౌర్యఇన్‌లోని ఆయన కార్యాలయంలో పార్టీ క్యాడర్‌తో కలిసి మంత్రి టీజీ భరత్‌ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్‌ మాట్లాడుతూ ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ విడుడల చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ పరమేష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:57 AM