వేణుగోపాలుడి అవతారంలో అహోబిలేశుడు
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:41 PM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహో బిలంలో వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహుడు వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆళ్లగడ్డ ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహో బిలంలో వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహుడు వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చీఫ్ అడ్మినిస్ట్రేటర్ పార్ధసారఽథి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణు గోపాలన్, ఆర్చకులు మనియర్ సౌమ్యనారాయణన్ స్వామికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పొన్నచెట్టు వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. దిగువ అహోబి లంలో ఉదయం ప్రహ్లాద వరద స్వామికి నవ కలశపూర్వక స్నపన తిరుమంజనం, సాయంత్రం విశేష పూల మాలలతో ప్రత్యేక అలంకారంతో ఉత్సవం నిర్వహించారు. ఈ ఉ త్సవాలను తిలకించి స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తన తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు.